: రూ.20 కోట్ల విలువైన నిషేధిత డ్రగ్స్ సరఫరా చేసూ పట్టుబడ్డ మహిళలు
అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ.20 కోట్ల విలువైన నిషేధిత ఎఫిడ్రిన్ ఔషధాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు మహిళలను చెన్నై ఎయిర్ పోర్టు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ కౌలాలంపూర్ కు వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చి తమ బ్యాగ్ లను 'చెక్ ఇన్' చేశారు. తనిఖీల్లో భాగంగా వీరి బ్యాగులలో ఎఫిడ్రిన్ ఉన్నట్టు కనుగొని వాటిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు అప్పగించినట్టు సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు. ఇద్దరు మహిళలనూ అదుపులోకి తీసుకొని, వారికి ఈ డ్రగ్స్ ఎవరు అందించారన్న విషయంపై విచారణ ప్రారంభించినట్టు పోలీసులు తెలిపారు.