: జనవరి 26న దాడులు తప్పవు: రాజస్థాన్ మంత్రులకు ఐఎం మెయిల్స్
భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న దాడులు చేస్తామని ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు ప్రకటించారు. ఈ మేరకు సదరు ఉగ్రవాద సంస్థ నుంచి రాజస్థాన్ కేబినెట్ లోని 16 మంది మంత్రుల అధికారిక ఈ-మెయిళ్లకు మెసేజ్ లు వచ్చాయి. జనవరి 26న తప్పనిసరిగా దాడులు చేసి తీరతామని ఆ సందేశాల్లో ఐఎం ఉగ్రవాదులు హెచ్చరించారు. ఏకంగా కేబినెట్ మంత్రులకు బెదిరింపు మెయిళ్లు రావడంతో రాజస్థాన్ పోలీసులు అప్రమత్తమయ్యారు. మెసేజ్ లు ఎక్కడి నుంచి వచ్చాయన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో ఉగ్రవాద కదలికపై నిఘా పెంచారు.