: రజనీకాంత్ ఆస్తుల వేలానికి ఎగ్జిమ్ బ్యాంకు ప్రకటన జారీ
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆస్తుల వేలానికి రంగం సిద్ధమైంది. రజనీ ఆస్తుల వేలానికి సంబంధించిన పత్రికా ప్రకటనను ఎగ్జిమ్ బ్యాంకు జారీ చేసింది. చిత్ర నిర్మాణ రంగంలోని మీడియావన్... ఎగ్జిమ్ బ్యాంకు వద్ద రుణం తీసుకుంది. ఈ రుణానికి రజనీకాంత్ సతీమణి హామీ ఇచ్చారు. అయితే తీసుకున్న రుణాన్ని చెల్లించడంలో మీడియావన్ జాప్యం చేస్తోంది. రుణాన్ని రాబట్టుకునే క్రమంలో ఎగ్జిమ్ బ్యాంకు రజనీకాంత్ ఆస్తుల వేలానికి నేడు పత్రికా ప్రకటన జారీ చేసింది.