: ‘ఇందిరమ్మ’ అక్రమార్కులపై చర్యలు: మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఇంద్రకరణ్ రెడ్డి
ఇందిరమ్మ ఇళ్ల అక్రమాలపై చర్యలు తప్పవని తెలంగాణ గృహనిర్మాణ, న్యాయశాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కొద్దిసేపటి క్రితం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల అక్రమాలపై సీఐడీ దర్యాప్తు సాగుతోందని, నివేదిక అందగానే అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. న్యాయశాఖలో కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఇంద్రకరణ్ రెడ్డికి పలువురు ఉన్నతాధికారులు, టీఆర్ఎస్ నేతలు అభినందనలు తెలిపారు.