: ముగిసిన తొలి రోజు ఆట... తడబడి నిలబడిన ఆస్ట్రేలియా
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మెల్ బోర్న్ లో జరుగుతున్న మూడో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ కు ఆదిలోనే షాక్ తగిలింది. ఖాతా కూడా తెరవకుండానే ఓపెనర్ వార్నర్ ఔట్ కావడంతో ప్రారంభంలో ఆస్ట్రేలియా తడబడింది. అనంతరం రోజర్ (57), వాట్సన్ (52), మార్ష్ (32), బర్న్స్ (13) పరుగులు చేసి పెవిలియన్ చేరారు. కెప్టెన్ స్మిత్ (72), హాడిన్ (23)లు మరో వికెట్ కోల్పోకుండా తొలి రోజు ఆటను ముగించారు. దీంతో, తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు 5 వికెట్ల నష్టానికి 259 పరుగుల చేసి... నిలదొక్కుకుంది. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్, షమీ చెరో 2 వికెట్లు తీయగా... అశ్విన్ ఓ వికెట్ పడగొట్టాడు.