: విధుల్లో ఉండి బార్ డాన్సర్ తో చిందులేసిన ఎస్ఐ... హల్ చల్ చేస్తున్న వీడియో


గుజరాత్ రాష్ట్రంలో ఆయనో ఎస్ఐ. డ్యూటీలో ఉన్న సమయంలో ఒక బార్ కు వెళ్లి అక్కడి డాన్సర్ తో కలసి చిందులేశాడు. ఆమెపై డబ్బు కూడా విసిరేశాడు. అతని పేరు డీసీ సోలంకి. సూరత్ లోని దిండోలి ప్రాంతంలోని బార్ లో ఈ ఘటన జరుగగా ఎవరో తన మొబైల్ ఫోన్ లో చిత్రీకరించారు. దాన్ని వాట్స్ యాప్ లో పెట్టగా, అలా అలా అది సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలోకి పాకిపోయింది. సుమారు మూడు నెలల క్రితం ఈ ఘటన జరుగగా, వారం నాడు వీడియో వెలుగులోకి వచ్చింది. ఎస్ఐపై విచారణకు ఆదేశించినట్టు పోలీసు చీఫ్ రాకేశ్ అస్తానా తెలిపారు.

  • Loading...

More Telugu News