: ఉద్యోగినిపై లైంగిక వేధింపులు... పోలీసుల అదుపులో సన్ టీవీ సీఓఓ
ఒక మహిళా ఉద్యోగితో అసభ్యంగా ప్రవర్తించినందుకు సన్ టీవీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ)ను ఈ ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో తాను సూర్య టీవీలో ప్రోగ్రామ్ ప్రొడ్యుసర్ గా పనిచేసినప్పుడు సీఓఓ ప్రవీణ్ లైంగికంగా వేధించాడని ఓ యువతి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దాని ఆధారంగా ప్రవీణ్ ను ప్రశ్నించిన సీసీబీ టీం, ఉద్యోగిని ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయని నమ్మి ఆయనను అదుపులోకి తీసుకుంది. మాజీ టెలికాం మంత్రి దయానిధి మారన్ సోదరుడైన కళానిధి మారన్ నడుపుతున్న సన్ నెట్ వర్క్ లో న్యూస్ ఎడిటర్ వి.రాజాపై 2013 లో ఇలాంటి ఆరోపణలే వచ్చాయి.