: కేశినేని నాని వ్యాఖ్యలపై టీడీపీ అధిష్ఠానం సీరియస్: వివరణ ఇవ్వాలని ఆదేశం!
విజయవాడలో అధికారుల తీరుపై విరుచుకుపడిన ఎంపీ కేశినేని నాని... క్షణాల వ్యవధిలోనే టీడీపీ అధిష్ఠానం ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది. ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వ స్థాయిలో పరిష్కరించుకోవాలి తప్ప బహిరంగంగా నోరుపారేసుకుంటే ఎలాగంటూ ఆయనకు ఇప్పటికే అధిష్ఠానం నుంచి ఫోన్లు వెళ్లినట్లు తెలుస్తోంది. అంతేకాక ఈ విషయంపై వివరణ ఇవ్వాల్సి ఉందని కూడా ఆయనను పార్టీ అధినాయకత్వం హెచ్చరించినట్లు సమాచారం. నగరంలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదని నాని కొద్దిసేపటి క్రితం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.