: బహిరంగ ప్రదేశాల్లో బ్యానర్లు, ఫ్లెక్సీలు తొలగించండి: తెలుగు రాష్ట్రాలకు హైకోర్టు ఆదేశం


బహిరంగ ప్రదేశాల్లోని బ్యానర్లు, ఫ్లెక్సీలను తక్షణమే తొలగించాలని హైకోర్టు తెలుగు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో ఇష్టారాజ్యంగా వెలుస్తున్న బ్యానర్లు, ఫ్లెక్సీలపై దాఖలైన పిటిషన్ ను విచారించిన సందర్భంగా కొద్దిసేపటి క్రితం కోర్టు ఈ మేరకు రెండు రాష్ట్రాలను ఆదేశించింది. ఈ విషయంలో రెండు రాష్ట్రాల పరిధిలోని డీజీపీలు, జిల్లాల కలెక్టర్లు, మునిసిపల్ కమిషనర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కోర్టు తన తీర్పులో పేర్కొంది. అంతేకాక వీటి తొలగింపునకు సంబంధించి తక్షణ చర్యలు చేపట్టాలని కూడా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News