: హంద్రీనీవా పంపింగ్ స్టేషన్ వద్ద వెలుగులోకి వచ్చిన రెండు పెద్ద గుహలు


కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని బ్రాహ్మణ కొట్కూరులో హంద్రీనీవా రెండవ పంపింగ్ స్టేషన్ వద్ద రెండు పెద్ద గుహలు వెలుగులోకి వచ్చాయి. పంపింగ్ స్టేషన్ వద్ద కాలువ ఎడమగట్టుకు రెండు రోజుల క్రితం గండి పడింది. దీంతో నీరు అడుగంటగా మనుషులు వెళ్ళడానికి సరిపడేంత వెడల్పుతో ఉన్న పెద్ద గుహలు దర్శనమిచ్చాయి. దీంతో ప్రజలు సైతం గుహల్లోకి వెళ్లి వస్తున్నారు. లోపల చీకటిగా ఉండటంతో ఎవరూ ఎక్కువ దూరం వెళ్లేందుకు సాహసించడం లేదు. నల్లమల అడవుల్లో ఎన్నో గుహలు ఉండటం, ఈ ప్రాంతం శ్రీశైల క్షేత్రానికి దగ్గరగా ఉండటంతో ఈ గుహలు వేల ఏళ్లనాటివని ప్రజలు భావిస్తున్నారు. ఈ గుహలను పురావస్తు నిపుణులు పరిశీలించాల్సి ఉంది.

  • Loading...

More Telugu News