: కేసీఆర్ ను కలిసిన విష్ణు... టీఆర్ఎస్ లో చేరేందుకేనా?
కాంగ్రెస్ మాజీ ఎంఎల్ఏ, దివంగత నేత పీజేఆర్ తనయుడు విష్ణువర్థన్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే అలానే అనిపిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ను క్యాంపు కార్యాలయంలో విష్ణువర్థన్ రెడ్డి కలిశారు. తన తండ్రి వర్థంతి కార్యక్రమంలో పాల్గొనాలని ముఖ్యమంత్రిని కోరినట్టు ఆయన తెలిపారు. ఐ మ్యాక్స్ ఎదురుగా ఉన్న పార్క్ కు పీజేఆర్ పేరు పెట్టాలని కోరినట్టు వివరించారు. ఇటీవలి పోలీసు కేసులు, ఓ ఎంఎల్ఏతో వివాదం నేపథ్యంలో విష్ణు స్వయంగా వెళ్లి కేసీఆర్ ను కలవడం పలు ఊహాగానాలకు తావిస్తోంది.