: జనవరి 7న హైదరాబాదుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా
దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు సాధించే దిశగా దృష్టి సారించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా జనవరి 7న హైదరాబాద్ రానున్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణలో కొనసాగుతున్న పార్టీ సభ్యత్వ నమోదును సమీక్షిస్తారు. గత ఆగస్టులో హైదరాబాద్ పర్యటన సందర్భంగా మిషన్-2019ను ప్రకటించిన అమిత్ షా, ఆ ఎన్నికలకు పార్టీ నేతలను సమాయత్తం చేసే దిశగా పలు సూచనలు చేశారు. జనవరి 7 పర్యటన సందర్భంగా వాటి అమలుపై ఆయన సమీక్షించనున్నట్లు సమాచారం. శని, ఆదివారాల్లోనే ఆయన హైదరాబాద్ రావాల్సి ఉంది. అయితే శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికకు సంబంధించి ఓటరు నమోదు నేపథ్యంలో అమిత్ షా తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. హైదరాబాదుతో పాటు తెలంగాణలోని మరో ముఖ్య నగరం వరంగల్ లోనూ పార్టీ నేతల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని తలచినా, జనవరి 7 నాటి పరిస్థితులకు అనుగుణంగా షెడ్యూల్ లో మార్పులు జరిగే అవకాశాలున్నాయి.