: పాతబస్తీలో చిన్నారుల అపహరణకు యత్నం


హైదరాబాదు, పాతబస్తీలోని వట్టేపల్లిలో ఇద్దరు చిన్నారుల అపహరణకు దుండగులు యత్నించారు. మీరాజ్, నాజిర్ అనే ఇద్దరు చిన్నారులను ద్విచక్రవాహనంపై దుండగులు ఎత్తుకు పోయేందుకు ప్రయత్నించారు. వారి ప్రయత్నాన్ని యాకుత్ పురా వద్ద గుర్తించిన చిన్నారులు దుండగుల ద్విచక్రవాహనంపై నుంచి దూకేశారు. దీంతో దుండగులు పరారయ్యారు. స్థానికులు చిన్నారులను పోలీసులకు అప్పగించారు. దీంతో పోలీసులు వారిని తల్లిదండ్రులకు అప్పగించనున్నారు.

  • Loading...

More Telugu News