: పెషావర్ దాడికి ఉగ్రవాదులు మూల్యం చెల్లించక తప్పదు: నవాజ్ షరీఫ్


పెషావర్ లోని సైనిక పాఠశాలపై పాశవిక దాడికి పాల్పడి 140 మంది బాలల మృతికి కారణమైన ఉగ్రవాదులు మూల్యం చెల్లించక తప్పదని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ స్పష్టం చేశారు. ఇస్లామాబాద్ లో ఆయన మాట్లాడుతూ, పాకిస్థాన్ వ్యాప్తంగా పలు జైళ్లలో ఉంటున్న ఉగ్రవాదుల విచారణ కోసం ప్రత్యేక సైనిక న్యాయస్థానాలను ఏర్పాటు చేయనున్నామని అన్నారు. అన్ని జైళ్లలో ఉన్న తీవ్రవాద కేసులపై విచారణ రెండు సంవత్సరాలలో పూర్తవుతుందని ఆయన పేర్కొన్నారు. పెషావర్ దాడిని పాక్ సైన్యం తీవ్రంగా పరిగణిస్తోంది. సైనికుల కుటుంబాలపై ఆ ఘటన తీవ్ర ప్రభావం చూపడంతో, ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతి సైనికుడు పేర్కొంటున్నారు. దీంతో తీవ్రవాదులపై పాక్ దాడులు చేస్తోన్న సంగతి తెలిసిందే. కాగా, నవాజ్ షరీఫ్ కుమారులను కూడా వదలమంటూ ఉగ్రవాదులు ప్రతిన బూనిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News