: రాష్ట్ర విభజన చట్ట సవరణపై టీఆర్ఎస్ వైఖరి ఏంటో చెప్పాలి: పొన్నం
రాష్ట్ర విభజన చట్ట సవరణపై టీఆర్ఎస్ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, విభజన చట్టం, కేంద్రంతో సంబంధాలపై టీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారన్నారు. హైదరాబాదుపై పెత్తనం కోసం కేంద్రం ప్రయత్నించే అవకాశం ఉందని ఆయన ఆరోపించారు. ఏపీ కౌన్సిల్ సభ్యుల సంఖ్య పెంచడం వరకే చట్టసవరణ పరిమితమవుతుందని తాను భావించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.