: ఆర్థిక సంబంధాలు, అయిన వారిని కానోళ్లను చేస్తున్నాయి


ఆర్థిక సంబంధాలు మానవ బంధాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి. మైక్రోఫ్యామిలీల్లో మానవ సంబంధాలన్నీ అర్థిక సంబంధాలైపోతున్నాయి. పెద్దల మధ్య మనస్పర్థలు పసివారి పాలిట శాపాలుగా మారుతున్నాయి. ఆస్తి తగవులు, అక్రమ సంబంధాలకు పసివారు సమిధలుగా మారుతున్నారు. తాజాగా జరిగిన దారుణాలే అందుకు సాక్ష్యాలుగా మిగిలాయి. రెండేళ్ల వయసున్న మోక్షజ్ఞను ఆస్తి కోసం సొంత చిన్నాన్నే కడతేర్చిన దారుణం గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. తమ ఏకాంతానికి అడ్డుగా మారిందన్న అక్కసుతో ఆరాధ్య అనే 19 నెలల చిన్నారిని సొంత బాబేయే కిరోసిన్ పోసి తగులబెట్టి, పొట్టన బెట్టుకున్న అమానవీయ ఘటన ఒంగోలులో చోటుచేసుకుంది. డబ్బు కోసం ఏడో తరగతి విద్యార్థి ఉదయ్ కిరణ్ ను పెదనాన్న కొడుకే కిడ్నాప్ చేసి, హత్య చేసిన సంఘటన హైదరాబాదులోని వనస్థలిపురంలో చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం చిత్తూరు జిల్లా తిరుచానూరులో లక్ష్మీప్రియ అనే ఐదేళ్ల చిన్నారిని మేనమామ హత్య చేసిన ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ హత్యలన్నింటి వెనుకా కంటికి రెప్పలా కాపాడాల్సిన వారే ఉన్నారు. అయిన వారే డబ్బు కోసం అఘాయిత్యాలకు పాల్పడుతున్న దారుణాలు పెరిగిపోతున్నాయి. మానవ సంబంధాల కంటే ఆర్థిక సంబంధానికి ప్రాముఖ్యతనిస్తుండడంతో ఈ దారుణాలు చోటుచేసుకుంటున్నాయి.

  • Loading...

More Telugu News