: ఢిల్లీ వీధుల్లో తొలిసారి అలరించనున్న తెలంగాణ శకటం
జనవరి 26న ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర శకటం కనువిందు చేయనుంది. కొత్త రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత పంద్రాగస్టు వేడుకలు జరిగినప్పటికీ, తెలంగాణ శకటానికి అనుమతి లభించలేదు. ఈ దఫా ప్రదర్శనలో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్ర శకటానికి కేంద్ర రక్షణశాఖ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రక్షణశాఖ ఓ ప్రకటన వెలువరించింది. ఇక మిగతా రాష్ట్రాలకన్నా మిన్నగా తెలంగాణ శకటాన్ని సాంస్కృతిక, సమాచార, పౌరసంబంధాల శాఖలు ఎలా తీర్చిదిద్దుతాయో చూడాలి!