: కథ కుదిరేలా ఉంది... 150వ చిత్రంలో నువ్వూ నటిస్తావు... చిన్నారికి చిరంజీవి హామీ


తన 150వ చిత్రానికి మంచి కథ కుదిరేలాగా కనపడుతోందని మెగా స్టార్ చిరంజీవి అన్నారు. ఎంఎన్ జే ఆసుపత్రిలో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి బాలును పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చిరు 150వ చిత్రంలో నటించాలని ఉందని బాలు తన మనసులోని మాటను చెప్పగా, "నువ్వు కోలుకొని బయటకు వచ్చి ఆరోగ్యంగా ఉండు. నా 150వ చిత్రంలో ఎక్కడో ఒకచోట కనిపించేలా నేను చేస్తా" అని చిరు హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News