: బొగ్గు గనుల వేలానికి ఈ-పోర్టల్ ప్రారంభం
బొగ్గు గనుల వేలం కోసం ఏర్పాటు చేసిన ఈ-పోర్టల్ ను కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ఈరోజు ప్రారంభించారు. బొగ్గు గనుల కేటాయింపు ఆర్డినెన్స్ కు కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో బొగ్గు మంత్రిత్వ శాఖ గనుల కేటాయింపులకు చర్యలు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో నేటినుంచి 24 బొగ్గు గనులకు వేలం మొదలవుతుంది. ఎక్కువగా బొగ్గు నిక్షేపాలున్న ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు రాబోయే 30 ఏళ్లలో రూ.7 లక్షల కోట్లకు పైగా ఆదాయం పొందే వీలుంది. సుప్రీంకోర్టు ఇటీవల రద్దు చేసిన 204 బొగ్గు గనుల్లో అత్యధికం ఈ మూడు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. వీటిలో కొన్నింటిని నేరుగా, మిగిలిన వాటిని ఈ-వేలం ద్వారా ప్రభుత్వం కేటాయించనుంది.