: ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమకు ఫోన్ చేసిన వైఎస్ జగన్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి నేటి ఉదయం ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును ఫోన్లో పలకరించారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి గండికోట వరకు పెండింగ్ లో ఉన్న కాలువ పనులను పూర్తి చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. పనులు పూర్తయితే లక్షల మందికి నీటి సరఫరా జరుగుతుందని ఆయన గుర్తు చేశారు. గండికోట ముంపు ప్రాంతాల సమస్య తీర్చేందుకు కృషి చేయాలని, పులివెందుల బ్రాంచి కెనాల్ కు తాగు, సాగు నీటిని వెంటనే విడుదల చేయాలని జగన్ కోరారు. మంత్రి దేవినేని సైతం సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.