: మాలవ్యాకు భారతరత్నపై రామచంద్రగుహ వ్యతిరేకత
పండిట్ మదన్ మోహన్ మాలవ్యాకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించడంపై ప్రముఖ చరిత్రకారుడు రామచంద్రగుహ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన మరణానంతరం పురస్కారం ప్రకటించడం సమర్థనీయం కాదని అభిప్రాయపడ్డారు. స్వాతంత్ర్య సమరయోధుడు, హిందూ మహాసభ నాయకుడైన ఆయనకన్నా ఇంకా ఎందరో మహనీయులు ఉన్నారని గుహ పేర్కొన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్, జ్యోతీ బాపూలే, బాలగంగాధర్ తిలక్, గోపాలకృష్ణ గోఖలే, స్వామి వివేకానంద, అక్బర్, ఛత్రపతి శివాజీ, కబీర్, అశోక సామ్రాట్, గురునానక్ ల పేర్లు కూడా వస్తాయని చెప్పారు. చనిపోయిన వారికి పురస్కారం ఇంతటితో ఆపివేయాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విట్టర్ పోస్టులకు ఆయన ప్రతి వ్యాఖ్యలు చేశారు. అయితే మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయికి పురస్కారం ప్రకటించడం సమంజసమేనని గుహ తెలిపారు.