: షరీఫ్ కు ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు
పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ పుట్టినరోజు సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. షరీఫ్ ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థిస్తున్నానంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. పాక్ ప్రధాని నేడు 64వ పడిలోకి అడుగుపెడుతున్నారు. ఈ నెల 16న పెషావర్ సైనిక పాఠశాలపై జరిగిన తీవ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండించిన మోదీ పాక్ కు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. ఇలా సరిహద్దు దేశమైన పాక్ కు సంబంధించి ప్రతి విషయంలోనూ మోదీ వెంటనే తన స్పందన తెలుపుతూ వస్తున్నారు.