: నిమ్స్ లో రెండు రోజుల పాటు ఓపీ సేవలు బంద్
హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రిలో రెండు రోజుల పాటు ఔట్ పేషెంట్ (ఓపీ) సేవలు రద్దయ్యాయి. క్రిస్ మస్ పర్వదినం నేపథ్యంలో, ఈ నెల 25, 26 తేదీల్లో సదరు సేవలు ఉండవని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్రనాథ్ తెలిపారు. అయితే, అత్యవసర సేవలు మాత్రం అందుబాటులో ఉంటాయని ఆయన వెల్లడించారు.