: పేద కుటుంబానికి రూ.155 కోట్ల లాటరీ
ఆస్ట్రేలియాలోని కాన్ బెర్రాలో నివసిస్తున్న ఓ పేద కుటుంబం అది. వారి ఆస్తులు తాకట్టులో ఉన్నాయి. అయితేనేం, ఆ కుటుంబాన్ని అదృష్టం పలకరించింది. కాదు, పక్కనే వచ్చి తిష్టవేసుకు కూర్చుంది. విషయం ఏంటంటే... ఈ కుటుంబానికి 30 మిలియన్ల ఆస్ట్రేలియన్ డాలర్ల (రూ.155 కోట్లు) భారీ లాటరీ తగిలింది. క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో ప్రకటించిన ఓజ్ లొట్టొ లాటరీలో కాన్‌బెర్రాకు చెందిన ఓ మహిళ ఈ నెల 16వ తేదీన లాటరీ టికెట్‌ను కొనుగోలు చేసింది. తాను ఓజ్ లొట్టొ లాటరీ గెలుకున్న సంగతి తెలుసుకున్న ఆమె ఆనందానికి అంతులేకుండా పోయింది. ఈ డబ్బుతో తొలుత తమ అప్పులు తీరుస్తామని, ఆపై కుటుంబసమేతంగా ఫస్ట్ క్లాస్ విమాన ప్రయాణం చేయాలని ఉందని ఆమె అంటోంది.