: న్యూ ఇయర్ నాడు ఒకే హోటళ్లో కోహ్లీ, అనుష్క!
అవును. కొత్త సంవత్సరాదిని పురస్కరించుకుని టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి బాలీవుడ్ నటి అనుష్క శర్మ న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోనుంది. టీమిండియా సభ్యుల వెంట విదేశీ పర్యటనల్లో వారి గర్ల్ ఫ్రెండ్స్ వెళ్లడంపై బీసీసీఐ నిషేధాన్ని విధించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం కోహ్లీ ఆస్ట్రేలియా టూర్ లో ఉండగా, అనుష్క ముంబైలో ఉంది. దీంతో న్యూ ఇయర్ వేడుకలనెలా గడపాలన్న సందిగ్ధంలో ఉన్న వారికి బీసీసీఐ బంపర్ ఆపర్ ఇచ్చింది. క్రికెటర్లతో వారి భార్యలు న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోవచ్చని చెప్పిన బీసీసీఐ, తాజాగా గర్ల్ ఫ్రెండ్ లతో కలిసి వేడుకల్లో పాల్గొనేందుకు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ తాజా నిర్ణయాన్ని వెల్లడించారు. దీంతో త్వరలోనే అనుష్క ఆస్ట్రేలియా విమానం ఎక్కనుంది. ఎంచక్కా కోహ్లీతో కలిసి న్యూ ఇయర్ వేడుకల్లో మునిగితేలనుంది.