: ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల విభజన పూర్తి
అఖిల భారత సర్వీసు అధికారుల విభజన ప్రక్రియ పూర్తయింది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల విభజన దస్త్రంపై ప్రధాని నరేంద్ర మోదీ సంతకం చేశారు. ప్రత్యూష్ సిన్హా కమిటీ చేసిన సిఫారసులను ఆమోదిస్తూ ప్రధాని సంతకం చేయడంతో విభజన ప్రక్రియ పూర్తైంది. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన అఖిల భారత సర్వీసు అధికారులకు స్పష్టత లభించనుంది. కాగా, అధికారుల విభజనపై ఒకట్రెండు రోజుల్లో అధికారిక ఉత్వర్వులు వెలువడనున్నాయి. ఆ వెంటనే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు తమకు కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లనున్నారు.