: స్థలం రెడీ... విద్యాలయం ఏర్పాటు చేయండి: కేంద్ర మంత్రితో మెదక్ ఎంపీ


మెదక్ జిల్లా సిద్దిపేట శివార్లలో స్థలాన్ని సేకరించామని... ఆ ప్రాంతంలో కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కోరారు. ఈ రోజు ఆయన కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీని కలిశారు. ఈ సందర్భంగా కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేయాల్సిందిగా కోరారు. దీనికి సంబంధించి వినతి పత్రాన్ని సమర్పించారు. మెదక్ ప్రాంతంలో విద్యారంగం అభివృద్ధి కోసం విద్యాలయాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని... కేంద్రీయ విద్యాలయం తప్పకుండా మంజూరవుతుందని చెప్పారు.

  • Loading...

More Telugu News