: జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ లకు బీజేపీ పరిశీలకుల నియామకం
జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండవ రోజే పార్టీ పరిశీలకులను బీజేపీ నియమించింది. జమ్మూ కాశ్మీర్ కు అరుణ్ జైట్లీ, అరుణ్ సింగ్... జార్ఖండ్ కు జేపీ నద్దా, వినయ్ సమస్త్రబుధేలు నియమితులయ్యారు. ఈ రోజు జరిగిన పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండు రాష్ట్రాలకు పరిశీలకులుగా వెళ్లనున్న వీరు... ఆ రాష్ట్రాలకు బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేతలను ఎన్నుకోనున్నారు.