: భవనాలు కాదు, బడుగులకు అధికారం ఇవ్వండి: కేసీఆర్ కు షబ్బీర్ అలీ సూచన


సమాజంలోని బడుగు, బలహీన వర్గాలకు కావాల్సింది భవనాలు కాదని, ఆ వర్గాలకు రాజ్యాధికారం దగ్గర కావాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ కోరారు. ఎస్సీ, ఎస్టీలకు హైదరాబాద్ లో భవనాలు నిర్మించినంత మాత్రాన వారు అభివృద్ధి చెందినట్టు కాదని, వారిని అధికారంలో భాగస్వాములను చేయాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. 49 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు సీఎం కేసీఆర్ ఇచ్చింది కేవలం మూడు మంత్రి పదవులేనని ఆయన గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఈ వర్గాలకు ఉపయోగపడేలా ఇంటెగ్రేటెడ్ భవనాలు నిర్మించాలని షబ్బీర్ అలీ సూచించారు.

  • Loading...

More Telugu News