: వాజ్ పేయిపై నాకు అమితమైన ఇష్టం, గౌరవం ఉన్నాయి: మమత


మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయికి భారతరత్న ఇవ్వడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆనందం వ్యక్తం చేశారు. వాజ్ పేయి అంటే తనకు అమితమైన ఇష్టం, గౌరవం ఉన్నాయని అన్నారు. దేశ అభ్యున్నతి కోసం అనుక్షణం తపించిన వాజ్ పేయికి భారతరత్న ఇవ్వాలనుకోవడం సముచితమైన నిర్ణయమని అన్నారు. వాజ్ పేయి సిద్ధాంతాలు అత్యున్నతమైనవని... అందరూ వాటిని ఆచరించాలని చెప్పారు. వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు, ఆయన కేబినెట్ లో మమత మంత్రిగా పనిచేశారు.

  • Loading...

More Telugu News