: పదేళ్ల తర్వాత మరోసారి 'మంత్రి' కుర్చీపై తలసాని


తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నులు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ నేడు బాధ్యతలు స్వీకరించారు. పదేళ్ళ క్రితం ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ హయాంలో మంత్రిగా తలసాని విధులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత టీడీపీ అధికారాన్ని కోల్పోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ తలసాని టీఆర్ఎస్ పార్టీలో చేరగా, కేసీఆర్ ఆయనను మంత్రివర్గంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో సుమారు దశాబ్దకాలం తరువాత తలసాని తిరిగి మంత్రి పదవిని చేపట్టినట్లయింది. కాగా, బాధ్యతల స్వీకరణ అనంతరం తలసాని మాట్లాడుతూ, తెలంగాణలో సినీ పరిశ్రమ అభివృద్ధికి సహకరిస్తామన్నారు. చిన్న సినిమాలను ప్రోత్సహిస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News