: బోడోల అణచివేతకు కేంద్రం నిర్ణయం... 5 వేల మంది పారామిలిటరీ బలగాల మోహరింపు


ఆదివాసీలపై బోడో తీవ్రవాదులు జరిపిన దాడిని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. దాడి నేపథ్యంలో అసోం పోలీసులు బోడోలపై ఉక్కుపాదం మోపగా, రాష్ట్ర బలగాలకు మరింత దన్నుగా నిలిచేందుకు కేంద్రం అదనపు బలగాలను అసోంకు పంపింది. 5 వేల మంది పారామిలిటరీ బలగాలను అసోంకు పంపిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దాడి నేపథ్యంలో బోడోలపై పోరు సాగించేందుకు 50 కంపెనీల పారామిలిటరీ బలగాలను పంపాలని అసోం ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అసోం ప్రభుత్వ వినతికి సానుకూలంగా స్పందించిన కేంద్రం అదనపు బలగాలను మోహరించేందుకు నిర్ణయం తీసుకుంది. ‘‘అమాయకులైన గిరిజనులను తీవ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. ఈ దాడిని తీవ్రంగా పరిగణించక తప్పదు’’ అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. దాడి జరిగిన ప్రాంతాలను సందర్శించేందుకు వెళుతున్న హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, అసోం ముఖ్యమంత్రితో తాజా పరిస్థితిని సమీక్షించనున్నారు.

  • Loading...

More Telugu News