: ఎర్రచందనం అక్రమ రవాణాలో మహిళా స్మగ్లర్... కానిస్టేబుల్ తో కలిసి చక్రం తిప్పిన వైనం


స్వల్ప వ్యవధిలోనే కోట్లకు పడగలెత్తేందుకు అవకాశం ఉందన్న భావనతో ఎర్రచందనం అక్రమ రవాణాలోకి లెక్కలేనంత మంది దిగుతున్నారు. ఇప్పటిదాకా పురుషులే ఈ అక్రమ దందాలో కార్యకలాపాలు సాగిస్తుండగా, గుట్టుచప్పుడు కాకుండా దుంగలను సరిహద్దులు దాటిస్తున్న మహిళా స్మగ్లర్ దీపను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రగిరి మండలం నేండ్రగుంటకు చెందిన దీప అనే మహిళ కొంతకాలంగా ఎర్రచందనం అక్రమ రవాణాను కొనసాగిస్తోంది. తిరుపతిలోని పీటీసీకి చెందిన కానిస్టేబుల్ శివకుమార్ సహకారంతో దీప సాగిస్తున్న స్మగ్లింగ్ కు పోలీసులు ఎట్టకేలకు చెక్ పెట్టారు. దీపతో పాటు ఆమెకు సహకరించిన కానిస్టేబుల్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడప జిల్లా రైల్వేకోడూరు మండలం జంగిటివారిపల్లెకు చెందిన దీప నేండ్రగుంటలో స్థిరపడినట్లు పోలీసులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News