: నన్ను నేను కోల్పోయినట్టే భావిస్తున్నా: బాలచందర్ మృతిపై రజనీ స్పందన


"బాలచందర్ నాకు స్నేహితుడు, తత్వవేత్త, మార్గదర్శి. చెప్పటానికి పదాలే లేవు. ఈ సమయంలో నన్ను నేను పోగొట్టుకున్నట్టే భావిస్తున్నా. ఆయన ఆత్మ శాంతించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా" అని తన గురువు, విఖ్యాత దర్శకుడు బాలచందర్ మృతిపై నటుడు రజనీకాంత్ ఈ విధంగా స్పందించారు. ఆయన కన్నుమూశారని తెలుసుకున్న రజనీ వెంటనే వెళ్లి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాలచందర్ సర్ కేవలం తన గురువే కాదని, తన తండ్రిలాంటి వ్యక్తని అన్నారు. ఎప్పుడూ తనను ఓ నటుడిగా చూడకుండా తన కొడుకులా చూశారని రజనీ చెప్పారు. మానవ రూపంలో ఉన్న దేవుడని, ఆయనను కోల్పోయిన బాధను అనుభవిస్తున్నానన్నారు.

  • Loading...

More Telugu News