: అభిమాని చెంపలు వాయించిన క్రికెటర్ యూసుఫ్ పఠాన్


తన గురించి అసభ్య వ్యాఖ్యలు చేసిన ఓ యువకుడిని డ్రెస్సింగ్ రూంలోకి పిలిచి మరీ చెంపలు వాయించాడు క్రికెటర్ యూసుఫ్ పఠాన్. బరోడా, జమ్మూ కాశ్మీర్ మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ యువకుడు పఠాన్ తో పాటు అంబటి రాయుడిని సైతం దూషించినట్టు బరోడా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి స్నేహాల్ పారిఖ్ తెలిపారు. పలుమార్లు ఆ యువకుడు దుర్భాషలాడాడని, అందువల్లే పఠాన్ కోపం ఆపుకోలేక పోయాడని వివరించారు. యూసుఫ్ ను అతని సోదరుడు ఇర్ఫాన్ అదుపు చేయగా, ఆ యువకుని బంధువు ఒకరు వచ్చి క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగిందని స్నేహాల్ తెలిపారు.

  • Loading...

More Telugu News