: కేంద్ర కేబినెట్ భేటీ ప్రారంభం... వాజ్ పేయికి భారతరత్నపై చర్చ


ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. ప్రధాని అధికారిక నివాసంలో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి, స్వాతంత్ర్య సమరయోధుడు, విద్యావేత్త మదన్ మోహన్ మాలవ్యాలకు భారతరత్న పురస్కారాల ప్రదానంపై ఈ భేటీ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. కేబినెట్ భేటీ ముగియగానే దీనిపై ప్రభుత్వం అధికారికంగా ప్రకటన వెలువరించే అవకాశాలున్నాయి.

  • Loading...

More Telugu News