: శ్రీవారి సమాచారం


ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి ఉచిత దర్శనానికి 9 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 8 గంటలు పడుతోంది. ఈ ఉదయానికి 8 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కాగా ద్వాదశి పర్వదినాన స్వామివారిని దర్శించుకునేందుకు టికెట్ల విక్రయాన్ని ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నట్టు టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు. అంతర్జాలం ద్వారా ఈ ప్రక్రియ ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమవుతుందని, మొత్తం పదివేల టికెట్లు అందుబాటులో ఉంటాయని, ఒక్కొక్క టికెట్ ధర 300 రూపాయలని ఆయన తెలిపారు. ప్రముఖులు స్వయంగా హాజరయితేనే పరిమిత సంఖ్యలో టికెట్లు విక్రయిస్తామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News