: అసోంలో విరుచుకుపడ్డ బోడోలు... 34 మంది మృతి
అసోం రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. రెండు గ్రామాల్లోని ప్రజలపై బోడోలాండ్ మిలిటెంట్లు దాడులకు పాల్పడ్డారు. స్ధానికులపై మిలిటెంట్లు విచక్షణా రహితంగా కాల్పులకు పాల్పడ్డారు. దీంతో 34 మంది మృతి చెందారు. కోక్రాఝర్ జిల్లాలోని సరల్పర గ్రామం, సోనిట్ పూర్ జిల్లాలోని శాంతిపూర్ గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది.