: డ్రైవర్ లేని గూగుల్ కారుకు టెస్ట్ డ్రైవ్
గూగుల్ రూపొందిస్తున్న డ్రైవర్ లేని కారు టెస్ట్ రన్ కు సిద్ధమైంది. దీనిని తయారు చేస్తున్న బృందం ప్రాజెక్టుకు సంబంధించిన వివరాల్ని గూగుల్ ప్లస్ లో షేర్ చేసింది. ఈ ఏడాది క్రిస్మస్ సెలవుల్ని ఈ కారు టెస్ట్ రన్ కోసమే వినియోగించనున్నామని గూగుల్ డ్రైవర్ లెస్ కారు తయారీ బృందం తెలిపింది. కొత్త సంవత్సరం రోజున ఈ కారుతో ఉత్తర కాలిఫోర్నియా వీధుల్లో ప్రయాణిస్తామని ఆ బృందం వెల్లడించింది. డ్రైవర్ అవసరం లేకుండా తనంత తానుగా నడిచే కారును తయారు చేస్తున్నామని, గత మే నెలలో గూగుల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.