: 19 మంది బంగ్లా దేశీయులకు ఏపీలో 5 నెలల జైలు


19 మంది బంగ్లా దేశీయులకు తిరుపతి ఐదో మున్సిఫ్ కోర్టు ఐదు నెలల జైలు శిక్ష విధించింది. పాస్ పోర్టు, వీసాలు లేకుండా ఆగస్టు 26న వీరు ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశించారు. రేణిగుంట విమానాశ్రయంలో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శిక్షా కాలం ముగిసిన వెంటనే వీరిని బంగ్లాదేశ్ రాయబారికి అప్పగించనున్నారు. అనంతరం వారికి అక్కడ కూడా న్యాయపరీక్ష ఎదురు కానుంది.

  • Loading...

More Telugu News