: 42 స్థానాలతో జార్ఖండ్ లో అధికారం చేబడుతున్న బీజేపీ


జార్ఖండ్ లో ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 42 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ అధికారం చేపట్టనుంది. ఇంత వరకు అధికార పార్టీగా కొనసాగిన జేఎంఎం పార్టీ 18 స్థానాలు గెలుచుకుని ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అసెంబ్లీలో కొలువుదీరనుంది. జేవీఎం పార్టీ 8 స్థానాలు గెలుచుకుని మూడవ స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ పార్టీ కేవలం 6 స్థానాలకే పరిమితమై చావుతప్పి కన్ను లొట్టబోయింది. ఇతరులు 6 స్థానాల్లో విజయం సాధించారు. దీంతో జార్ఖండ్ లో స్పష్టమైన ఆధిక్యం సాధించిన బీజేపీ అధికారం చేపట్టనుంది.

  • Loading...

More Telugu News