: ముగిసిన కాకా అంత్యక్రియలు
కాంగ్రెస్ సీనియర్ నేత జి.వెంకటస్వామి (కాకా) అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాదు పంజాగుట్ట శ్మశాన వాటికలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, పలువురు ప్రముఖులు అంత్యక్రియలకు హాజరయ్యారు. అంతకుముందు, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కాకా భౌతికకాయానికి నివాళులర్పించిన సంగతి తెలిసిందే.