: ప్రభుత్వ ఏర్పాటులో తొందరపడం... జమ్మూకాశ్మీర్ ప్రజలకు ధన్యవాదాలు: ముఫ్తీ మహ్మద్ సయీద్
జమ్మూ కాశ్మీర్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో తొందరపడబోమని పీడీపీ అధినేత ముఫ్తీ మహ్మద్ సయీద్ స్పష్టం చేశారు. శ్రీనగర్లో ఆయన మాట్లాడుతూ, జమ్మూ కాశ్మీర్ లో అత్యధిక స్థానాలు సాధించడంలో సహకరించిన ప్రజలందరికీ ధన్యవాదాలని అన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే వారితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కొంత సమయం పడుతుందని వివరించారు. జమ్మూకాశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీల పాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ప్రజలు ఎన్నికల్లో స్పష్టం చేశారని ఆయన అన్నారు.