: ప్రభుత్వం సాధించిన విజయాల గురించి ప్రజలకు చెప్పండి: మోదీ


ఆరు నెలల పాలనా కాలంలో ప్రభుత్వం సాధించిన విజయాల గురించి ప్రజలకు చెప్పాలని ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ ఎంపీలకు సూచించారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పార్లమెంటులో ప్రభుత్వం ఆమోదించిన బిల్లుల గురించి ప్రజలకు వివరించాలని అన్నారు. రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయాలని సూచించిన ఆయన, ప్రజలు విపక్షాల వలలో పడకుండా అభివృద్ధి పనులు, సుపరిపాలన గురించి మరింతగా వివరించాలని సూచించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నాటికి ఎంపీలు విషయ పరిజ్ఞానం పెంచుకోవాలని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News