: 'జబర్దస్త్' వేణుపై దాడి చవకబారు చర్య: మంచు మనోజ్
ఈటీవీలో ప్రసారమయ్యే కామెడీ షో 'జబర్దస్త్'లో నటించిన కమెడియన్ వేణుపై ఆదివారం దాడి జరిగిన సంగతి తెలిసిందే. 'జబర్దస్త్' కార్యక్రమంలో కల్లుగీత వృత్తిని, గౌడ మహిళలను కించపరచారంటూ హైదరాబాద్ ఫిలింనగర్లో గౌడ విద్యార్థి సంఘం నేతలు వేణుపై దాడి చేశారు. ఈ దాడిని సినీ కళాకారులు, టీవీ ఆర్టిస్టులు ముక్తకంఠంతో ఖండించారు. తాజాగా, ఈ దాడిపై హీరో మంచు మనోజ్ స్పందించారు. ఇది చవకబారు చర్య అని, అమానవీయం అని ట్వీట్ చేశారు. తొలుత అందరం మనుషులమన్న సంగతి గుర్తుంచుకోవాలని, ఆ తర్వాతే కుల, మతాలు అని హితవు పలికారు.