: ఏపీ శాసనసభ శీతాకాల సమావేశాల విశేషాలివే
ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 18న ప్రారంభమైన శాసనసభ సమావేశాలు ఐదురోజులు జరిగాయి. ఈ ఐదు రోజుల్లో శాసనసభ సుమారు 22 గంటల 54 నిమిషాలపాటు సమావేశమైంది. అసెంబ్లీలో మొత్తం 36 ప్రశ్నలు లేవనెత్తగా, 18 ప్రశ్నలకు సమాధానాలు లభించాయి. రెండు అంశాలపై లఘు చర్చలు జరగగా, ఐదు బిల్లులు ప్రవేశపెట్టారు. ఈ ఐదు బిల్లులూ ఆమోదం పొందాయి. అంతేగాకుండా, సభలో మూడు తీర్మానాలు కూడా ప్రవేశపెట్టారు.