: లంక జైళ్ల నుంచి 66 మంది మత్స్యకారుల విడుదల
భారత మత్స్యకారులను శ్రీలంక అరెస్టు చేయడం, కొన్నాళ్లకు విడుదల చేయడం సాధారణంగా జరుగుతున్న తంతు. తాజాగా, 66 మంది భారత జాలర్లను విడుదల చేసినట్టు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ తెలిపారు. ఈ రాత్రికి వారంతా భారత తీరం చేరుకుంటారని ట్విట్టర్ లో వెల్లడించారు. వారిలో 27 మంది నాగపట్నం, 19 మంది పుదుకొట్టై, 12 మంది రామేశ్వరం, 8 మంది కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని కారైకాల్ కు చెందిన వారున్నారు. లంక జలాల్లో చేపలు పడుతుండగా ఈ జాలర్లను గతంలో పలు సందర్భాల్లో లంక నేవీ అరెస్టు చేసింది.