: జార్ఖండ్ లో ప్రభుత్వం ఏర్పాటు దిశగా బీజేపీ... సీఎం అభ్యర్థిపై ఉత్కంఠ!


జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం లాంఛనమే. మొత్తం 81 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 38 స్ధానాల్లో బీజేపీ విజయం సాధించగా, మరో 5 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో, జార్ఖండ్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా బీజేపీ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో, సీఎం ఎవరు? అనే ఆసక్తికర చర్చ ప్రారంభమైంది. తాజా ఎన్నికల్లో జార్ఖండ్ సీఎం అభ్యర్థి ఎవరనేది ప్రకటించకుండానే బీజేపీ బరిలో దిగింది. గతంలో జరిగిన మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో కూడా బీజేపీ సీఎం అభ్యర్థిని ప్రకటించలేదు. అదీ కాక, ఆ రాష్ట్రంలో ఇంత వరకు ఆదివాసీ వ్యక్తులే సీఎంలుగా ఉంటూ వచ్చారు. దీంతో, ఈసారి ఎవరు సీఏం కానున్నారనే ఉత్కంఠ రేగుతోంది. అర్జున్ ముండా సీనియర్ గా రేసులో ముందంజలో ఉన్నప్పటికీ ఆయన ఓటమిపాలయ్యారు. దీంతో, రేసు నుంచి ఆయన వైదొలగినట్టే. మరోవైపు, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో సంఘ్ పరివార్ నేపథ్యమున్న వారినే ముఖ్యమంత్రులుగా ఎన్నుకున్న తరుణంలో జార్ఖండ్ లో కూడా అలాంటి నేతకే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News