: కాశ్మీర్ లో పీడీపీతో కలిసేందుకు కాంగ్రెస్ సిద్ధమే: గులాం నబీ ఆజాద్


జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు హంగ్ వాతావరణం సృష్టించాయి. దీంతో, పార్టీలు భాగస్వాముల కోసం వెతుక్కుంటున్నాయి. ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో మేం కలుస్తామంటే, మేం కలుస్తామని ఇతర పార్టీలు ముందుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో, లీడ్ లో ఉన్న పీడీపీ (పీపుల్స్ డెమెక్రటిక్ పార్టీ)తో కలిసి ప్రభుత్వ ఏర్పాటులో పాలు పంచుకుంటామని కాంగ్రెస్ బహిరంగంగా ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్ నేత గులాం నబీ అజాద్ మాట్లాడుతూ, "మా తలుపులెప్పుడూ తెరిచే ఉంటాయి. గతంలో పీడీపీతో పాటు ఎన్సీతోనూ సంకీర్ణంగా ఉన్నాం. ఒక విషయంలో మాత్రం స్పష్టంగా ఉన్నాం. బీజేపీతో కలసి వెళ్లం. వాళ్లిద్దరి (పీడీపీ, ఎన్సీ)తో మాత్రం కలుస్తాం" అని అజాద్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News