: చంద్రబాబుపై అసెంబ్లీ లాబీలో మంత్రి కేఈ కృష్ణమూర్తి అసంతృప్తి


ముఖ్యమంత్రి చంద్రబాబుపై అసెంబ్లీ లాబీలో ఏపీ డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి అసంతృప్తి వెళ్లగక్కారు. సభలో ఇతర మంత్రులకు మాట్లాడే అవకాశం సీఎం ఇవ్వడం లేదని, అన్ని విషయాలపై ఆయనే మాట్లాడుతున్నారని మీడియా ఎదుట వ్యాఖ్యానించారు. సీఎం మాట్లాడిన కొన్ని సందర్భాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడుతున్నాయని కేఈ అన్నారు. సభలో నిన్న జగన్ కాస్త మెరుగైనట్టు కనిపించిందని చెప్పారు. ఇక ఏపీ రాజధాని శంకుస్థాపనకు మరో రెండేళ్లయినా పట్టవచ్చన్న మంత్రి, రాజధానిని ఎంతైనా అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు. సాగునీటిరంగంలో మొదటి ప్రాధాన్యం రాయలసీమకు ఇవ్వాలని సీఎంకు స్పష్టంగా చెప్పానన్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారని, వాళ్లను రమ్మని తామేమీ పిలవటం లేదని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News